Hyderabad Sanghi Balaji Temple
ఆలయ చరిత్ర:
హైదరాబాద్ సిటీకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వీకెండ్ స్పాట్ సంఘీ శ్రీవెంకటేశ్వర ఆలయం.
ఈ ఆలయం పద్మనాభగిరిపై ఫిబ్రవరి ఇరవైఐదు 1992 సంవత్సరంలో సంఘీ కుటుంబ సభ్యులచే జయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టించబడింది. ప్రస్తుతం అనిత సంఘ్వీ ఈ ఆలయ బాధ్యతల్ని చూసుకుంటున్నారు.
ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు. ఈ ఆలయానికి నడక మార్గంలో నూట డభ్బైఆరు మెట్లు దాటి చేరుకోవాలి. మెక్కులు మొక్కే భక్తులు కాలి నడకన స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ.
ప్రత్యేకతలు:
స్వామివారికి కుడివైపున శ్రీ పద్మావతి అమ్మవారు ఉండగా ఎడమ వైపున శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంది.
ఈ ఆలయం ప్రాంగణంలోనే అష్టలక్ష్మీ అమ్మవార్ల మండపం ,నవగ్రహాల మండపం ఉండడం మరో విశేషం.
ఈ ఆలయంలో రామోజీ ఫిలింసిటీకి ఆనుకోని ఉన్నందువల్ల అనేక సినిమాలు ఇక్కడనే చిత్రీకరణ జరుపుకున్నాయి. నువ్వునాకు నచ్చావ్, కాటంరాయుడు, ఖుషి, కిక్ ,పవిత్రబంధం, బొమ్మరిల్లు చిన్న పెద్ద ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఈ గుడి చూడగానే మీకు గుర్తుకువస్తాయి.
చుట్టూ ఎత్తైన కొండల మధ్య పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం పర్యటకులను మంత్రముగ్థుల్ని చేస్తోందనడంలో అతిశయోక్తి లేదు.
మీరు గనక హైదరాబాద్ వాసులైతే మీ వీకెండ్ ట్రిప్‌లో సంఘీ టెంపుల్ని విజిట్ చేస్తారని ఆశిస్తూ..#Satishkakimukkala
0 Comments