NAGARJUNA SAGAR DAM- నాగార్జున సాగర్ డ్యామ్
1955వ సంవత్సరం డిసెంబరు 10వ తారీఖున భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారు డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పన్నెండు సంవత్సరాలు అనంతరం నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ లోని మహాత్మగాంధి బస్ స్టాండ్ నుంచి మాచర్ల వెళ్లే బస్సు ఎక్కితే నాగార్జున సాగర్ చేరుకోవచ్చు. అవే బస్సులో ఎల్బీనగర్ నుంచి సాగర్ రింగు రోడ్డు మీదుగా యాచారం,కొండమళ్లేమల్లి మీదుగా వెళ్లొచ్చు. అలాగే విజయవాడ నుంచి నల్గొండ, గుంటూరు మీదుగా కూడా సాగర్ చేరుకోవచ్చు.
డ్యామ్ ని చూడలంటే సాగర్ నుంచి కొత్త బ్రిడ్జి దగ్గరకైతే చేరుకోవాలి. ఈ బ్రిడ్జి దాటగానే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లా భూభాగంగా పరిగణించొచ్చు. ఇక్కడ నుంచి మాచర్ల ఇరవై ఏడు కిలోమీటర్లు.
డ్యామ్ సందర్శనకు అనువైన కాలం:
ఏటా జూలై, ఆగష్టు ,సెప్టెంబర్ మాసాల్లో ఎగువున కురుస్తున్న వర్షాలకు సాగర్ డ్యామ్ నిండు కుండలా తలపిస్తూ చూపరులకు కనువిందు చేస్తోంది. పర్యటకులు కృష్ణమ్మ పరవళ్లు చూసి ఆనందంతో మంత్ర ముగ్థులవుతున్నారు. ఈ డ్యామ్ 26 గేట్లతో నిర్మించడం జరిగింది. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన డ్యామ్ గా సాగర్ ఆనకట్ట నిలిచింది.
వర్షాకాలంలో డ్యామ్ గేట్లు తెరిచే ఉండడంతో పర్యటకంగా ఎంతో ప్రసిద్ధి గాంచింది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ ఆనకట్టని సందర్శించేందుకు అనువైన కాలం.
తెలంగాణలోని నల్గొండ ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా భూభాగంలో నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఈ డ్యామ్ నిర్మించిన ప్రాంతానికి ఎంతో చారిత్రక వైభవం ఉంది. ఇక్కడ ఉన్న నాగార్జున కొండపై భౌద్ద అవశేషాలు ఆనాటి చరిత్రను తెలియజేస్తున్నాయి. ఆచార్య నాగార్జునుడు ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం ఉండేదని చరిత్ర ఆనావళ్లు తెలుపుతున్నాయి.
చరిత్ర:
ప్రపంచంలోనే మొదటి రాతికట్టడంగా ఈ ఆనకట్ట ప్రసిద్ధి కెక్కింది. 1967. ఆగష్టు 4వ తేదిన ప్రధాని ఇందిరాగాంధి చేతుల మీదుగా కుడి, ఎడమ కాలువలకు నీటిని వదిలి ఆనకట్ట ని ప్రారంభించడం జరిగింది. సాగు నీరే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కి కూడా సాగర్ డ్యామ్ సేవలందిస్తోంది.
ముక్త్యాల రాజవారి కృషి అభినందనీయం:
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా నల్లగొండ, గుంటూరు, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో నేడు సుభిక్షంగా పంటలు పండుతున్నాయంటే ముక్త్యాల రాజవారు శ్రీ రాజవాసిరెడ్డి గోపాలక్రిష్ణ మహేశ్వర ప్రసాద్ గారే కారణం.వంశపారంపర్యంగా వచ్చిన రాజరికంతో ఆయన తృప్తి చెందలేదు. ప్రజలకు పది కాలాలు ఉపయోగపడాలన్న సదుద్దేశంతో, తన సొంత ఖర్చులతో అనేక వూర్లు తిరిగారు. రైతులను చైతన్యం చేసి కృష్ణా ఫార్మర్స్ సొసైటీ ని స్థాపించారు. నాగార్జున సాగర్ వద్ద (నంది కొండ వద్ద ) ఆనకట్ట కడితే బహుళార్ధసాధకంగా ఉపయోగపడుతుందని ఆలోచన చేశారు. డ్యామ్‌లో ఉన్న నీటి నిల్వలతో పంటలు పండించుకుని కరవుని దూరం చేయవచ్చని ఆశించారు. ఆర్థికంగా అభివృద్ధి అయి తెలుగునేల అన్నపూర్ణగా, భారత దేశ ధాన్యగారంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలని భావించి బ్రిటీష్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నాగార్జున సాగర్ నిర్మాణం పై పాలకుల దృష్టి పడేందుకు పెద్ద ఎత్తున ధనాన్ని ఖర్చు చేసి కృషి చేశారు. సొంత నిధులతో విజయవాడ నుంచి నందికొండ(నాగార్జున సాగర్) వరకు రహదారి నిర్మించి, డ్మామ్ నిర్మాణంపై వేసిన ఖొస్లా కమిటీకి రోడ్డు మార్గం కల్పించారు. రాజవారి దానగుణం, ప్రాజెక్టుకు ఆయన చేసిన కృషికిగాను పల్నాడు, నల్గొండ ప్రజలు ఆయన విగ్రహాన్ని ప్రాజెక్టుకు సమీపంలో ఏర్పాటు చేసి నేటికి గౌరవించుకుంటున్నారు.
భారతదేశంలో ఉన్న బహుళార్థక సాధక ప్రాజెక్టులలో మొదటిది గా నాగార్జున సాగర్ డ్యామ్ ప్రత్యేకతను చాటుకుంది . విహర యాత్రలకు, పర్యటకంగా అనువైనదిగా గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా వారాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది పర్యటకులు సాగర్ ని సందర్శిస్తారు.
నాగార్జునకొండ ద్వీపం :
నాగార్జునకొండ ద్వీపానికి లాంచీ ప్రయాణం అందుబాటులో ఉంది. ఇది ఒక పురాతన బౌద్ధ స్థావరం . ఇక్షావాకు రాజవంశం నుండి అవశేషాలు మరియు కళాఖండాలను ప్రదర్శించే మ్యూజియంకు నిలయం.
మీరు కూడా మీ టూర్ లిస్ట్‌లో నాగార్జున సాగర్ డ్యామ్‌ని చేర్చుకుంటారని ఆశిస్తూ...#SatishKakimukkala
0 Comments