Janjavathi Rubber Dam - జంఝావతి రబ్బర్ డ్యామ్
డ్యామ్ నేపథ్యం:
పార్వతీపురం మన్యం జిల్లా లోని రాజ్యలక్ష్మీపురం గ్రామానికి దగ్గర్లో ఉంది ఈ జంఝావతి రబ్బర్ డ్యామ్.పార్వతీపురం పట్టణానికి 12 కిలో మీటర్ల దూరంలో ఆనకట్ట నిర్మాణం జరిగింది.
ఆసియా ఖండంలోనే మొదటి రబ్బర్ డ్యామ్ గా ఈ ఆనకట్ట ప్రసిద్ధి చెందింది. డ్యామ్ నిర్మాణం మొత్తం ఆస్ట్రియా దేశపు టెక్నాలజీతో నిర్మించడం ప్రత్యేకత.
2006 వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
పార్వతీపురం, కొమరాడ , సీతానగరం, గరుగుబిల్లి, మక్కువ మండలాల్లో మొత్తం 24,640 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు జంఝావతి డ్యామ్ ని నిర్మించారు.
అసలు రబ్బర్ డ్యామ్ అంటే ఏంటి ?
సాధారణంగా డ్యామ్ అంటే కాంక్రీటుతో నిర్మించి మధ్యలో స్పిల్ వే ఇనుము గేట్లను అమర్చుతారు. వరద నీటిని ఇనుము గేట్లు అడ్డకుని ఆనకట్టకు సాయం చేస్తాయి. ఇందుకు భిన్నంగా ఐరన్ గేట్లకు బదులు పెద్ద సైజు రబ్బర్ ట్యూబ్ ని ప్రవహిస్తున్న నీటిని నిలిపేందుకు ఉపయోగిస్తారు. అందువల్లే ఆస్ట్రియా దేశపు ఇంజినీర్లు ఈ డ్యామ్ నిర్మాణానికి పని చేసారు.
రబ్బర్ ట్యూబ్ నీటిని ఎలా నిలుపుదల చేస్తుంది ?
రెండు కాంక్రీటు గోడల మధ్యలో రబ్బర్ ట్యూబ్ ని పెట్టి దానిలోకి పైపులు ద్వారా గ్యాస్ మరియు గాలిని పంపించి ట్యూబ్ పైకి లేపి , నీటికి ఒక అడ్డుగోడల ఉండేట్లు చేస్తారు. అపుడు ప్రవహిస్తున్న నీరు ఆగుతుంది తద్వారా కుడి,ఎడమ కాలువల ద్వారా నీటిని సాగు కోసం మళ్లిస్తారు.
ప్రస్తుతం డ్యామ్ పనులు ఆగిపోవడానికి కారణం ఏంటి?
80 శాతం డ్యామ్ పనులు అయిపోయినప్పటికీ ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దు కావడంతో కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. రబ్బర్ డ్యామ్‌తో నీటిని నిలిపి వేస్తే ఒడిస్సా భూభాగంలో ఉన్న కొన్ని గ్రామాలు నీటి ముంపునకు గురి అవుతాయి. ఈ కారణంగా ఒడిస్సా ప్రభుత్వం డ్యామ్ పూర్తి పనులకు కేంద్రం సహాయంతో అడ్డు పడుతోంది.
పచ్చని ప్రకృతి మధ్యలో ఉండే ఈ రబ్బర్ డ్యామ్ జంఝవతి నదిపై నిర్మించారు. మీరు కూడా ఈ డ్యామ్ ని సందర్శించాలని కోరుకుంటూ...#SatishKakimukkala

0 Comments