Koheda Hill Top Hyderabad - కొహెడ గుట్ట
Koheda Hill Top Hyderabad
ఎక్కడ ఉంది?
హైదరాబాద్ మహా నగరంలో ఎల్. బీ నగర్ నుంచి 25 కిలో మీటర్ల దూరంలో ఉంది కొహెడ గ్రామం పక్కనే కొండ మీద అద్భుతమైన ట్రెక్కింగ్ పాయింట్ ఉంది. అలాగే హనుమాన్ మందిరం, ఓఆర్ఆర్ పాయింట్ కూడా ఉంది.Koheda Hill Top Hyderabad
ఆలయానికి ఎదురుగా కొండపై ధ్యాన రూపంలో ఉన్న హనుమాన్ నాలుగు విగ్రహాలు నాలుగు దిక్కుల వైపు భక్తులకు దర్శనమివ్వడం విశేషం. ఎటు చూసినా ఆహ్లాదకరంగా, మనోరంజకంగా పరిసరాలు ఉండడం కొహెడ గుట్ట ప్రత్యేకత.
కొహెడ విలేజ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కొహెడ గుట్ట. అలాగే సంఘీ గ్రామానికి కూతవేటు దూరంలో ఉండడం వల్ల సంఘీ శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఈ గుట్టపై నుంచి కనపడడం మీరు వీడియో లో గమనించవచ్చు.
Koheda Hill Top Hyderabad
వైరల్ వ్యూ పాయింట్ (Viral View Point)
ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లో గుట్ట నుంచి కనపడే ఔటర్ రింగ్ రోడ్డు వ్యూ పాయింట్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రకృతి ప్రేమికులు, పర్యటకులు అలాగే కార్పొరేట్ ఉద్యోగులు ఓఆర్ఆర్ పాయింట్ ను చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. అందువల్ల వారంతంలో కొహెడ గుట్టకు ఔత్సాహికుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది అనడంలో అతిశయోక్తిలేదు.
హైదరాబాద్ వాసులైతే ఈ బ్లాగ్ చూసిన తరువాత మీరు కూడా మీ వీకెండ్ విజిట్‌లో కొహెడ గుట్టను చేర్చుకుంటారని అనుకుంటున్నాను..#SatishKakimukkala


0 Comments