Hyderabad Griff-In Adventure Park - అడ్వంచర్ పార్క్ -ఆరోగ్య సంజీవని వనం
ఎక్కడ ఉంది?
హైదరాబాద్ ఎల్‌బీనగర్‌కు పదిహేను కిలోమీటర్ల దూరంలో బీఎన్‌రెడ్డి నగర్‌కు రెండుకిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ రోడ్‌లో ఉంది ఈ అడ్వంచర్ పార్క్. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ గ్రిఫ్-ఇన్ అడ్వంచర్ పార్క్. దీనిని ఆరోగ్య సంజీవని వనం అని కూడా పిలుస్తారు.
ఎలా వెళ్లొచ్చు?
హైదరాబాద్ సిటీకి ఇరవైరెండు కిలో మీటర్ల దూరంలో నగర వాసులకు కనువిందు చేస్తోంది. ఔటర్ రింగురోడ్డు కనక్టెవిటీ ఉండడంతో నగర వాసులు సులభంగా ఈ పార్క్‌ను సందర్శించవచ్చు.అడ్వంచర్ యాక్టివిటీస్:
అడ్వంచర్ యాక్టివిటీస్ అయినటువంటి స్కై- సైక్లింగ్, జిప్‌లైన్, బోటింగ్, రాప్లింగ్, ఆర్చరీ, షూటింగ్, వాల్ క్లింబింగ్, రోప్ కోర్స్ వంటి వివిధ ఆటవిడుపు గేమ్స్ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.
ప్రత్యేకతలు:
ఫారెస్ట్ రేంజ్
ప్రాంతం అవ్వడం వల్ల చుట్టు పచ్చని చెట్లు వాటి మధ్యలో ఉన్న నీటి కొలనులు, వివిధ
రకాల జాతులకు చెందిన పక్షులు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, యోగా వంటి వివిధ వ్యాయమాలు చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఈ సంజీవని ఫారెస్ట్.
సందర్శకులు రోజు తమ వ్యాయమాలు చేసుకునేందుకు వీలుగా తక్కువ మొత్తంలోనే ప్యాకేజీలు ఉండడం విశేషం.
#SatishKakimukkala
0 Comments