తోటపల్లి బ్యారేజ్(పార్వతీపురం) - సర్దార్ గౌతులచ్చన్నప్రాజెక్టు
నేపథ్యం:
పార్వతీపురం మన్యం జిల్లాకు కి.మీ 15 ల దూరంలో తోటపల్లి బ్యారేజ్ బ్రిటీషు వారిచేఈ తోటపల్లి బ్యారేజ్ ఆంధ్ర రాష్టంలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగబిల్లి మండలం పరిధిలోకి వస్తుంది. ఈ ఆనకట్టకు స్వాతంత్య్ర సమర యోధుడైన సర్దార్ గౌతులచ్చన్న పేరు మీద అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాడునాయుడు గారు నామకరణం చేశారు.
పునాది రాయి ఎవరి హయంలో జరిగింది?
కొత్త ఆనకట్ట నిర్మాణానికి 2003 వ సంవత్సరంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు పునాదిరాయి వేయగా మరలా రెండో సారి అధికారం చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రి హోదాలో తానే 2015 వ సంవత్సరం సెప్టెంబరు 10 న ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాలను కలుపుకొని మొత్తం 1,20,000 ఎకరాలకు సాగు అలాగే తాగు నీటి అవసరాలను తీరుస్తుంది ఈ గౌతులచ్చన్న బ్యారేజ్.
చరిత్ర:
1908 లో 64,000 ఎకరాలకు నీటి సదుపాయం కల్పించే సామర్ధ్యం ఉన్న విధంగా నాగావళి నదిపై ఈ ఆనకట్ట నిర్మించడం జరిగింది. 2.51 టీఎమ్‌సీ ల సామర్ధ్యం కలిగిన కొత్త రెగ్యులేటర్ పాత నిర్మాణం స్ధానంలో నిర్మించబడింది.
వెంటాడుతున్న సమస్యలు:
2003 లో పునాదిరాయి పడినప్పటికీ కర్ణుడు చావుకి వంద కారణాలు అన్న చందంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కుంది తోటపల్లి బ్యారేజ్. కరకట్టలు కొరత, గుత్తేదారు నిర్లక్ష్యం, ప్రభుత్వం అలసత్వం, ప్రకృతి వైపరీత్యాలను దాటుకొని నిలచినప్పటికీ అరకొర సమస్యలు ఇంకా వెంటాడుతునే ఉన్నాయి.
ప్రధానంగా భూ పరిహారం విషయంలో రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నిధలు జాప్యం వల్ల తగినంత నష్ట పరిహారం అందలేదంటూ కర్షకలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చొరవతో ప్రాజెక్టు తుది దశకు చేరుకొని తన సేవల్ని ప్రారంభించింది.
ఒడిస్సాలో పుట్టిన నాగావళినది పార్వతీపురం, రాజం, శ్రీకాకుళం మీదుగా కళ్లేపల్లి వద్ద బంగాళఖాతంలో కలుస్తోంది. మీరు కూడా మీ సందర్శనలో తోటపల్లి డ్యామ్ ని చేర్చుకుంటారని ఆశిస్తూ..#Satish kakimukkala
0 Comments