Sri MukhaLingam - శ్రీముఖలింగం
శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు మండలంలో ఎంతో ప్రాశస్త్యం కలిగిన శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఉత్తరాంథ్రకే మకుటాయమానంగ నిలుస్తోంది శ్రీముఖలింగం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పట్టణానికి 40 కిలో మీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం.
ఆలయ విశిష్టత
- స్థలపురాణం
పూర్వం ఈ ప్రాంతాన్ని గోవిందారణ్యంగా ప్రజలు పిలిచేవారు. ద్వాపర యుగంలో వ్యోమకేశ మహారుషి లోకకళ్యాణార్థం వైష్టవ యాగాన్ని తలపెట్టాడు. ఈ యాగానికి గంధర్వులు, దేవతల్ని ఆహ్వానించాడు. యాగానికి విచ్చేసిన గంధర్వులు గోవిందారాణ్యంలో ఉన్న శబరి జాతి స్త్రీల అందాన్ని చూసి కామమోహితులయ్యారు. యాగానికి వచ్చిన విషయం మరిచి స్త్రీల ధ్యాసలో ఉన్న గంధర్వల్ని వ్యోమకేశ మహారుషి గమనించాడు. వెంటనే కోపోద్దీపుతుడైన రుషి, ఏ శబరి జాతి స్త్రీలను చూసి మీరు మోహించారో ఆ శబరి జాతిలోనే మీరు జన్మించెదరు గాక అని శపించాడు. వెంటనే దేవత రూపం కనుమరుగయ్యి శబరులుగా మారిపోయారు గంధర్వులు. తమ తప్పును తెలుసుకున్న గంధర్వులు వ్యోమకేశ మహారుషిని కలిసి శాపవిమోచనం కలిగించాలని వేడుకున్నారు. పరమేశ్వరుడు కలియుగంలో శ్రీముఖలింగేశ్వరునిగా అవతరించేటపుడు మీకు శాపవిమోచనం కలుగుతుందని చెప్తాడు.
గోవిందరణ్యంలో ఉన్న శబరులందరికీ రాజు చిత్కసేనుడు. ఈ చిత్కసేనునికి చిత్తి, చిత్కళ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వీళ్ల ఇంటి ప్రాంగణంలోనే విప్ప చెట్టు ఉండేది. విప్ప చెట్టు పువ్వులు అమ్మకుంటూ జీవనం సాగించండంటూ రాజు ఇద్దరు భార్యలకు చెట్టు కు ఉన్న చెరో కొమ్మని అప్పజెప్పాడు. గోవిందరణ్యంలో విప్ప చెట్లు ఎక్కువ. సంస్కృతంలో విప్ప చెట్టును మధువృక్షంగా పిలుస్తారు.
రెండో
భార్య వల్ల అశాంతికి
గురైన రాజు చిత్కసేనుడు
దీనికంతటికీ విప్పచెట్టే
కారణమంటూ పక్కనే ఉన్న
గొడ్డల్ని తీసుకొని విప్పచెట్టు(మధు వృక్షం)
మొదలు నరికాడు.
వెంటనే చెట్టు మొదలు నుంచి అగ్ని
కీలకలు పెద్డగా వచ్చి
ముఖఆకారంలో ఉన్న లింగం దర్శనమిచ్చింది.
మధువృక్షం నుంచి బయట
పడినందున మధుకేశ్వరునిగా
ఆ లింగం ప్రాశస్త్యం పొందింది. కృత
యుగంలో గోవిందశ్వరుడిగా, ద్వాపరయుగంలో జయంతేశ్వరుడిగా, త్రేతయుగంలో మధుకేశ్వరునిగా,
కలియుగంలో శ్రీముఖలింగేశ్వరుని గా పరమేశ్వరణ్ని భక్తులు
కొలిచినట్లు తెలుస్తోంది.
ఆలయ
ప్రాముఖ్యత
క్రీస్తు శకం 720 నుంచి 1450 వరకు కళింగ రాజ్యాన్ని పరిపాలించిన ఒకటవ కామర్నవుని కాలంలో ఈ ఆలయ నిర్మాణ ప్రారంభమయ్యింది. శిలాశాసనాల ద్వారా క్రీస్తుపూర్వం 8 వ శతాబ్దంలో చోడగంగ దేవర త్రికలింగాధిపతి శ్రీమాత్ అనంత వర్మచే నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. కాలక్రమంలో పర్లాకిముడి మహారాజావారు ఆలయ పునరుద్ధరణ చేసి స్వామివారికి భూములు సమర్పించి ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
రష్యా, ఇటలీ నుంచి వచ్చే విదేశీయులు ఈ ఆలయంలో చెక్కబడిన డిజైన్లు చూసి ఇప్పటి కాలంలో ఈ విధంగా చెక్కడం అసాధ్యమంటూ ఫోటోలని తీసుకొని ముచ్చట పడుతుంటారు. ప్రతీ శిల్పంలోను గంగ చాళుక్య శైలి ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తోంది. మందిరం ప్రాంగణంలోనే అష్టలింగాలు ఉండడం మరో విశేషం. ఒక్కొక్క దేవత వచ్చి ఈ లింగాల్ని ప్రతిష్టించారని ప్రతీతి. అలాగే ఆలయం చుట్టూ వివిధ గణపతిమూర్తులు ఉండడం మరో విశేషం. ప్రధానంగా ఈ క్షేత్రంలో పార్వతిదేవిని వారాహి అమ్మవారుగా కొలుస్తారు అర్చకులు.
శ్రీముఖలింగేశ్వరుని మహాత్యం
మట్టితో తయారుచేసిన పెద్ద
గోళం నిండా పాలు, పంచదారతో నింపి
శ్రీముఖలింగేశ్వరునికి అభిషేకం చేస్తానని మొక్కుతాడు. కొన్నాళ్లకి 60 సం.ల వయసులో నాగన్నకు మగ పిల్లవాడు
సంతానంగా పుడతాడు. అనుకున్న
విధంగానే పెద్ద గోళంలో పాలు, పంచదార పోసి
ఆలయానికి చేరుకుంటాడు. కానీ గర్భగుడి ద్వారంలోనికి గోళం
వెళ్లకపోవడంతో
స్వామి నీ మొక్కు తీర్చడం కుదరనందున నువ్వు ప్రసాదించిన ఈ
పిల్లాడిని నీవే తీసుకో అంటూ
గోళాన్ని పిల్లావాడిని ఆలయ ద్వారం
ముందు వదిలేసి నాగన్న ఇంటికి వెళ్లిపోతాడు.
స్వామి వారి వెనుక భాగంలో ఉన్న గోళంపై చిత్రంలో చూడొచ్చు
మరుసటి రోజు అర్చకులు స్వామివారి గర్భగుడి తలుపులు తీయగా శ్రీముఖలింగేశ్వరుని వెనుక భాగంలో పాలు, పంచదారతో నిండిన గోళం చూసి ఆశ్చర్యానకి లోనవుతారు. నాగన్నకు కబురు పంపగా ఆలయంలో ఉన్న పిల్లవాడిని, గోళాన్ని చూసి ఏమిటి ఈ మహిమ అంటూ కంటి నుంచి ఆనందభాష్పాలతో స్వామివారికి నమస్కరించుకుంటాడు. ఈ విధంగా శ్రీముఖలింగేశ్వరుని మహాత్యం కళింగ రాజ్యం దశదిశల వ్యాపించింది. ఆలయాన్ని దర్శించిన భక్తులు ఇప్పటికీ స్వామివారి వెనుకు ఉన్న ఈ గోళాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.
ఈ క్షేత్రంలో శ్రీముఖలింగేశ్వర ఆలయానికి ఉపఆలయాలుగా చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వర ఆలయం పశ్చిమ ముఖంగా ఉండడం విశేషం. కురుక్షేత్ర యుద్ధం అనంతరం భీముడు ప్రతిష్టించిన భీమేశ్వర ఆలయం కలదు. ఇక్కడ ఒకే రాతిపై రెండు నంది విగ్రహాలు ఉండడం మరో విశేషం. శ్రీముఖలింగ ఆలయానికి ఈ ప్రాంతంలో పద్మనాభగిరిపై కొలువై ఉన్న విష్ణువు క్షేత్రపాలకునిగా ఉన్నారు.
ఈ క్షేత్రాన్ని మీరు కూడా సందర్శించాలని కోరుకుంటూ.. #SatishKakimukkala



0 Comments