ADALI View Point అడలి వ్యూ పాయింట్
ఎక్కడ ఉంది? ఎలా వైరల్ అయ్యింది?
పార్వతీపురం మన్యం జిల్లా లోని పాలకొండకు కూత వేటు దూరంలో ఉన్న అడలి వ్యూ పాయింట్ గురించి తెలుసుకుందాం.ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమైలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అడలి వ్యూపాయింట్ చాలా ఫేమస్ అయ్యింది. ఉత్తరాంధ్రలోని పాలకొండకు కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లో ఉంది ఈ ఆడలి.ఈస్ట్రాన్ ఘాట్స్ (Eastren Ghats) గా పిలుచుకునే ఉత్తరాంధ్ర గిరుల సోయగం వర్ణించడానికి మాటలు దొరకవనేది నిజం. దట్టమైన అడవిలో కొండ మీదకు ప్రయాణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలాంటి అనుభావాన్నే ఇస్తోంది అడలి వ్యూ పాయింట్.
కనువిందు చేస్తున్న పకృతి సౌందర్యం
చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో కేవలం కొండ ప్రాంతాల్లోనే కనిపించే అరుదైన పక్షులు, కొన్ని ప్రత్యేక వృక్షాలు ఆద్యంతం ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అరటి, సీతాఫలం, టేకు, రావి, మునగ, వేప,మామిడి ఇంకా అనేక రకాలైన వృక్షాలు ఈ పరిసర ప్రాంతాల్లో కనువిందు చేస్తున్నాయి.
అందుబాటులోకి రానున్న సదుపాయాలు
పర్యటకుల తాకిడి ఎక్కువతున్నందువల్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఈ వ్యూ పాయింట్ ని అధికారులు అభివృద్ది చేస్తున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించి భోజన సదుపాయం కూడా అందుబాటులోకి తేనున్నారు.
అలరిస్తున్న సూర్యోదయం
ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు కొండల పై నుంచి సూర్యోదయాన్ని తిలకించాలనుకుంటే తప్పక చూడాల్సిన ప్రదేశం అడలి. ఎత్తైన తూర్పు కనుమల మధ్యలో అరుదైన వృక్షాల నడుమ ప్రయాణం ఎంత వర్ణించనా తక్కువే.
మీ ఉత్తరాంధ్ర టూర్‌లో అడలిని కూడా చేర్చుకుంటారని ఆశిస్తూ...#SatishKakimukkala
0 Comments