హైదరాబాద్ నుంచి వరంగల్‌కి వెళ్లే దారిలో భువనగిరి కంటే ముందుగా వచ్చేదే ఈ స్వర్ణగిరి.
ఎలా చేరుకోవాలి?
ఆలయానికి చేరుకోగానే స్వర్గగిరి ఆలయం కమాను దర్శనమిస్తుంది. కమాను దాటగానే స్వామివారి బ్రహ్మరథం కనపడుతుంది. ఆ పక్కనే భక్తులు స్వామి వారి పాదాలను దర్శనం చేసుకుంటున్నారు.
ఆలయ విశేషాలు:
ఇపుడు మీరు విడీయోలో చూస్తున్నది దశవాతారాల మండపం. స్వామి వారి ఒక్కొక్క అవతారం పాలరాతితో చెక్కబడి ఉండడం విశేషం అలాగే 108 మెట్లగల ఈ మండపాన్ని వైకుంఠ ద్వారంగా కూడా పిలుస్తారు.త్రిదండి చినజీయర్ స్వామివారి చేతుల మీదుగా స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించబడింది. మానేపల్లి రామారావుగారు, కుటుంబ సభ్యులు మందిరాన్ని నిర్మించారు.
ఈ స్వర్ణగిరి మందిరంలో మూలవిరాట్ అయినా శ్రీ వెంకటశ్వర స్వామివారు సువర్ణమూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మదనగోపాలునిగా పదహారు చేతులతో భక్తులకు కనువిందు చేస్తున్నారు.
ఎత్తైన నాలుగు రాజగోపురాలు నాలుగు మాడవీధులతో ఈ మందిరం బాలాజీ భక్తులను ఆధ్యాత్మిక భావాల్లోకి తీసుకెళ్తోంది అనడంలోఅతిశయోక్తి లేదు.
ఈ ఆలయం మొత్తం 22 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏడు సంవత్సరాల పాటు నిర్మాణ పనులు జరిగాయి. రోజుకి నలభై వేల నుంచి యాభై వేల మంది వరకు మానేపల్లి కొండలలో నెలకొన్న ఈ సువర్ణ నారాయుణ్ని దర్శించికొని భక్తి తో గోవింద అంటూ తన్మయత్వం చెందుతున్నారు.
ప్రత్యేకత ఆకర్షణగా బాలాంజనేయ ప్రతిమ
హనుమాన్ మండపం పక్కనే పదిహేడు వందల కేజీల కంచు గంట నేనున్నాను సుమా అంటూ జయ జయ ధ్వానాలతో మ్రోగుతూ ఉంటుంది.
మందిరం వెనుక భాగంలో స్వామి వారి నిత్య కళ్యాణ మండపం ఔరా ! అన్న విధంగా నిర్మించారు.
వెంకటేశుని భక్తులే కాకుండా యాదాద్రి వెళ్లే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తుల తాకిడితో స్వర్ణగిరి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తెలంగాణ రాష్ట్రానికే మకుటయామానంగా విరాజిల్లుతోంది.
మీరు కూడా ఆ ఆలయాన్ని సందర్శించా లని మనస్పూర్తిగా కోరుకుంటూ.. Satish Kakimukkala
0 Comments