మన సందర్శన్ టీవిలో ఒట్టిగడ్డ రిజర్వాయర్ గురించి తెలుసుకుందాం!
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం నుంచి రావాడ విలేజ్ కు ఆనుకొని ఉంది ఈ ఒట్టిగడ్డ డ్యామ్.ఇపుడు మీరు చూస్తున్న కాలువ ఇదైతే జియ్యమ్మవలస నుంచి రావాడ వెళ్లే దారిలో చూపరులకు కనువిందు చేస్తోంది. ఈ కాలువ పెదబుడ్డిడి గ్రామం నుంచైతే ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎలా చేరుకోవాలి?
రావాడ గ్రామం లోపలి నుంచి రెండు కిలోమీటర్ల ప్రయాణం అనంతరం ఒట్టిగడ్డ రిజర్వాయర్ కి చేరుకోవచ్చు.
పందొమ్మిది వందల డభ్బై ఒకటిలో ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ ఆరవ ముఖ్యమంత్రి మన శ్రీకాకుళం జిల్లా రాజాం నివాసులైన శ్రీ జలగం వెంకట్రావు గారు హయాంలో ఈ ఒట్టిగడ్డ డ్యామ్ పురుడు పోసుకున్నట్లు తెలుస్తోంది.
శ్రీ జలగం వెంకట్రావు గారు
నేపథ్యం:
ఆనాటి మధ్య తరహా నీటి పారుదల శాఖ మంత్రిగాశ్రీ వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు రాష్ట్రానికి తన సేవల్ని అందించారు.అప్పట్లో పార్వతీపురం శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఉండేది.
తూర్పు కనుమల కౌగిలిలో ఒదిగి ఉన్న ఒట్టిగడ్డ జలాశయం అందాల్ని ప్రతీ ఒక్కరూ చూసి తీరాల్సిందే. చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో కొలువైఉన్న ఈ డ్యామ్ పరిసరాలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతోంది.
ఈ ఒట్టిగడ్డ జలాశయం నాగావళి నదికి ఉపనది. ప్రస్తుత డ్యామ్ సామర్థ్యం ఇరవై ఏడు పాయింట్ పదమూడు మిలియన్ క్యూబిక్ మీటర్స్ గా తెలుస్తోంది.
Vatti Gedda Reservior
కురుపాం- జియ్యమ్మవలస మండలాల్లో 38 గ్రామాలాను కలుపుకుంటూ పదహారువేల ఆరువందల డభ్బై ఎకరాల భూమికి నీటి సౌకర్యం కల్పిస్తుంది ఈ ఒట్టిగడ్డ జలాశయం.
కుడి, ఎడమ కాలువల ద్వారా చుట్టూ పక్కల గ్రామాల పంట పొలాల్ని సస్యశ్యామలం చేస్తోంది ఈ ఒట్టిగడ్డ.ఎడమ కాలువ ఆయకట్టు మూడువేల మూడువందల అరవై ఎకాలు ఉండగా కుడి కాలువ పదమూడు వేల మూడువందల పది ఎకరాల్లో విస్తరించి ఉంది.
పార్వతీపురం నేడు జిల్లా గా రూపాంతరం చెందిన అనంతరం కూడా ఒట్టిగడ్డ రిజర్వాయర్‌ని పర్యటకంగా ఆదుకునే నాథుడే లేడంటూ ఉత్తరాంథ్ర వాసులు వాపోతున్నారు. పర్యటకంగా అభివృధ్ది చేసినట్లయితే విజయనగరం జిల్లాకు దగ్గర్లో ఉన్న తాటిపూడి జలాశయం అందాలకి ఏమాత్రం తక్కువ కాకుండ ఒట్టిగడ్డ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.
--Satish Kakimukkala





0 Comments