Hyderabad Badrinath Temple - హైదరాబాద్ బద్రినాథ్ ఆలయం
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మీదుగా బండమైలారం గ్రామానికి కూతవేటు దూరంలో ఉంది ఈ బద్రినాథ్ మందిరం.హైదరాబాద్ పరిసరాల్లో ఉత్తరాఖండ్‌కు చెందిన కళ్యాణ్‌ఖారీ సమాజం వారు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డారు. వాళ్లకంటూ ఒక గుర్తింపు ఉండాలని భావించి వారి కుల దైవమైన బధ్రినాథుని ఆలయం నిర్మించాలని గొప్ప ఆలోచనని ఆచరణలో చేసి చూపించారు.
ఉత్తరాఖండ్‌లో ఉన్న బద్రినాథ్ ఆలయాన్ని అందరూ దర్శించుకోలేరు. దర్శించుకోవాలని ఉన్న దూరభారం వల్ల అందరికీ సాధ్యం కాదు. అటువంటి వారందరూ హైదరాబాద్‌లో ఉన్న బద్రినాథ్ ఆలయాన్ని సందర్శించుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రెండు వేల గజాల్లో ఈ ఆలయం నిర్మించిడం జరిగింది. జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ మందిరాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ సిటీకి దగ్గర్లో ఉన్నందువల్ల వారంతంలో ఎక్కువ మంది ఆలయన్ని సందర్శించి బద్రినారాయణుణ్ని దర్శించుకుంటున్నారు.
Hyderbad Badrinath Temple - హైదరాబాద్ బద్రినాథ్ ఆలయం
ఈ ఆలయంలో ఉన్న అఖండ జ్యోతిని ఉత్తరాఖండ్‌లో ఉన్న బద్రినాథ్ ఆలయం నుంచి రోడ్డు మార్గం ద్వారా తీసుకొని వచ్చి ఈ ఆలయంలో ఉంచడం జరిగింది. భక్తులు జ్యోతి దర్శనం చేసుకోని బద్రినాథుణ్ని భక్తితో కొలుస్తున్నారు.
Hyderbad Badrinath Temple - హైదరాబాద్ బద్రినాథ్ ఆలయం
ఉత్తరాఖండ్ బద్రినాథ్ మందిరంలో ఏవిథంగా పూజ కార్యక్రమాలు జరుగతాయో అదే విథంగా ఈ మందిరంలో కూడా జరగడం విశేషం. పూజరులు కూడా ఉత్తరాఖండ్ వారే ఉండడం మరో ప్రత్యేకత.
ఉత్తరాఖండ్ బద్రినాథ్ ఆలయ నమూనా ఆధారంగానే హైదరాబాద్ బద్రినాథ్ ఆలయాన్ని నిర్మించారు.
ఆలయ గోడలపై ఉత్తర భారతదేశం ఆర్కిటక్చర్ స్టైల్ మీరు వీడియోలో చూడొచ్చు.
ఆలయం ప్రారంభించి రెండున్నర నెలలే అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ ఆలయం ఇప్పటికే చాలా ఫేమస్ అయ్యింది. అందువల్ల తక్కువ సమయంలోనే ప్రజలందరికీ హైదరాబాద్ బద్రినాథ్ ఆలయం చేరువయ్యింది.
Hyderbad Badrinath Temple - హైదరాబాద్ బద్రినాథ్ ఆలయం
దక్షిణ భారతదేశంలో బద్రినాథ్ ఆలయం ఒక్కటి కూడా లేదు. ప్రస్తుతం హైదరాబాద్ బద్రినాథ్ ఆలయమే సౌత్ ఇండియాలో మొట్టమొదటి ఆలయంగా ప్రాముఖ్యతను సంతరించుకొంది.
ఈ కారణంగా దక్షిణ్ కే బద్రినాథ్ (Dakshin Ke Badrinat) అని ఈ ఆలయాన్ని పిలుస్తున్నారు.
మీరు కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శిస్తారని కోరుకుంటూ... #SatishKakimukkala.



0 Comments