Karman ghat Hanuman Temple - కర్మన్ ఘాట్ హనుమాన్ మందిరం
హైదరాబాద్ నగరంలో ఎల్‌బీ నగర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కర్మన్ ఘాట్ పురాతన ఆలయం. 12 వ శతాబ్దంలో కాకతీయుల రాజైన రెండో ప్రతాప రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించరాని కథనం.పూర్వం ఈ ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ఈ ప్రాంతాన్ని లక్ష్మీనగరం గాపిలిచేవారు. ముఖ్యంగా రెండు ప్రధాన కథనాలు ఈ ఆలయానికి సంబంధించి ప్రచారంలో ఉన్నాయి.
కథనం -1
కాకతీయుల రాజైన రెండవ ప్రతాప రుద్రుడు తన పరివారంతో వేట కోసం ఇక్కడకు రాగా పులి గాండ్రింపు వినపడడంతో ఆ శబ్దాన్ని అనుసరిస్తూ ముందుకు సాగాడు. పులి కనపడక పోవడంతో వెనుతిరిగే ప్రయత్నం చేయగా సరిగ్గా అపుడే దట్టమైన పొదల నుంచి శ్రీరామ్ అనే శబ్ధం వినపడుతుంది. రామ నామం ఎక్కడ నుంచి వినిపిస్తుంది అని చూడగా రెండవ ప్రతాపరుద్రునకు అక్కడ ధ్యానాంజనేయ స్వామి విగ్రహాం దర్శనమిస్తుంది. వెంటనే రాజు పరిసరాల్ని శుభ్రపరచి విగ్రహాన్ని పూజలు చేసిన అనంతరం కోటకు పయనమవుతాడు. ఆ రోజు రాత్రి ప్రతాపరుద్రునికి ఆంజనేయ స్వామి వారు కలలో కనిపించి అక్కడ ఆలయం నిర్మించమని సూచిస్తారు.అలా ఈ గుడిని రెండో ప్రతాప రుద్రుడు నిర్మించడాని ప్రశస్తి.
అలాగే ఈ ఆలయానికి ఉన్న మరో చరిత్ర ఇపుడు తెలుసుకుందాం.
కథనం -2
పదిహేడవ శతాబ్ధంలో ఔరంగజేబు పాలనలో హిందూ ఆలయాల ధ్వంసం జరుగుతుండగా ఆ క్రమంలో ఔరంగజేబు సైన్యం ఈ హనుమాన్ మందిరాన్ని కూల్చేందుకు ప్రయత్నించింది. కానీ మహమ్మదీయుల సైన్యం ఈ ఆలయ సరిహద్దుల్ని కూడా టచ్ చేయలేకపోయింది. ఎన్ని సార్లు ప్రయత్నించినా సైనికులందరూ చెల్లాచెదురై మూర్ఛపోయి కిందపడిపోతున్నారు. ఈ విషయం ఔరంగజేబుకి తెలిసి నేనే స్వయంగా వచ్చి మందిరాన్ని కూల్చుతానని బయలుదేరుతాడు. ఔరంగజేబు తన ఆయుధాలతో మందిరం కూల్చడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా ఆకాశం నుంచి....హే రాజన్ మందిర్ తోడ్‌నా హైతో కరో మన్ ఘట్ అనే మాటలు ప్రతిధ్వనించగా ఔరంగజేబ్ ఒక్కసారిగా భయపడతాడు. ఔరంగజేబ్ ఏమిటీ ఈ మాయ అనుకొని ..వెంటనే అక్కడ నువ్వు సత్యమైతే నిజంగా నాకు కనపడు అని అడగ్గా...ఒక్కసారిగా ఆకాశంలో తాటిచెట్టు పరిమాణంతో తేజోవంతమైన కాంతిపుంజం మెరస్తుంది. ఆ మెరుపులో ధ్యానరూపంలో ఉన్న హనుమాన్ కనపడి మాయం అవుతారు. ఈ మహిమని చూసిన ఔరంగజేబు ఈ మందిరంలో ఏదో శక్తి ఉందని గ్రహించి తన సైన్యంతో మందిరం కూల్చే ప్రయత్నం విరమించి వెను తిరుగుతాడు. అలా ఆంజనేయస్వామి పలికిన మాటలే కరోమన్ ఘట్ కర్మాన్‌ఘాట్‌గా మారింది.
ఈ విధంగా కర్మాన్‌ఘాట్ హనుమాన్ మందిరంగా ఈ ఆలయం పిలవబడుతోంది.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్, కర్నాటక ప్రాంతల నుంచి భక్తులు ధ్యానంజనేయ స్వామి వారిని దర్శించి మొక్కుల చెల్లించుకుంటున్నారు.కేవలం హనుమాన్ ఆలయమే కాకుండా ప్రధాన ఆలయం చుట్టూ పదిహేను దేవీదేవతల పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానిది ఒక్కో ప్రత్యేకత.
ఈ ఆలయంలో ప్రధాన స్వామివారైన ధ్యానహనుమాన్ విగ్రహాన్ని దర్శించినంతనే మనస్సు ప్రశాంత చెందడం ఎవరికివారే అనుభవించాల్సింది తప్ప మాటల్లో వివరించలేం.
మీరు కూడా ఆ ఆలయాన్ని దర్శించాలని కోరుకుంటూ.. #SatishKakimukkala



0 Comments